బీఎడ్‌లో ఇకపై 12 పేపర్లు

బీఎడ్‌లో ఇకపై 12 పేపర్లు

  • నాలుగు సెమిస్టర్లుగా కోర్సు

  •  20 వారాలపాటు ఇంటర్న్‌షిప్

  •  జూలై నుంచి రెండేళ్ల కోర్సుగా బీఎడ్

  •  సిలబస్‌లో మార్పులు చేస్తున్న విద్యాశాఖ

  • సాక్షి, హైదరాబాద్: బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్‌లో (బీఎడ్) ఇకపై 12 పేపర్ల (ప్రశ్నాపత్రాలు) విధా నం అమల్లోకి రానుంది. సెమిస్టర్ విధానం, ఐదు నెలలపాటు(20 వారాలు) ఇంటర్న్‌షిప్ విధానాన్ని అమల్లోకి తెచ్చేందుకు విద్యాశాఖ కసరత్తు చేపట్టింది. బీఎడ్‌ను రెండేళ్ల కోర్సుగా మార్చిన నేపథ్యంలో రాష్ట్రంలో మార్పు చేసిన పాఠశాల విద్యా విధానం, పరీక్షల సంస్కరణలు, సిలబస్‌లో మార్పులకు అనుగుణంగా బీఎడ్ సిలబస్‌ను రూపొందించేందుకు విద్యాశాఖ చర్యలు చేపట్టింది.



    ఇందులో భాగంగా శుక్రవారం రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీలకు చెందిన విద్యావిభాగం అధిపతులు, ప్రభుత్వ, ప్రైవేటు బీఎడ్ కాలేజీల ప్రతినిధులతో సిలబస్ రూపకల్పనపై విద్యాశాఖ చర్చించింది. పాఠశాల విద్యా డెరైక్టర్ టి.చిరంజీవులు నేతృత్వంలో జరిగిన ఈ భేటీలో వివిధ అంశాలపై చర్చించారు. యూనివర్సిటీలు, ఉన్నత విద్యాశాఖ, పాఠశాల విద్యాశాఖ పర స్పర సహకారంతో పనిచేయాలని నిర్ణయించారు. ఈ సందర్భంగా సిలబస్‌లో తీసుకురావాల్సిన మార్పులను రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ మండలి (ఎస్‌సీఈఆర్‌టీ) డెరైక్టర్ జగన్నాథరెడ్డి, పరీక్షల సంస్కరణల కన్సల్టెంట్ ఉపేందర్‌రెడ్డి యూనివర్సిటీలు, కళాశాలల ప్రతినిధులకు తెలియజేశారు.



    కొత్త నిబంధనలను వివరించారు. గతంలో ఏడాది కోర్సుగా ఉన్న బీఎడ్‌లో 6 ప్రశ్నాపత్రాల విధానం అమల్లో ఉం డగా వచ్చే విద్యా సంవ త్సరంలో(జూలై నుంచి) అమల్లోకి రానున్న రెండేళ్ల బీఎడ్ కోర్సులో స్కూల్ ఇంటర్న్‌షిప్ కాకుండా 12 ప్రశ్నాపత్రాల విధానం అమలు చేసేందుకు ప్రణాళికలు రూపొందించుకోవాలని సూచించారు. రెండేళ్ల డిప్లొమా ఇన్ ఎలి మెంటరీ ఎడ్యుకేషన్(డీఈఎల్‌ఈడీ) కోర్సు సిల బస్‌లోనూ మార్పులు తెస్తున్నట్లు వెల్లడించారు.

     

    ఇవీ బీఎడ్‌లో రానున్న ప్రధాన మార్పులు...



    ఇప్పటివరకూ 8 వారాలే ఉన్న స్కూల్ ఇంటర్న్‌షిప్ (పాఠశాలల్లో ప్రాక్టికల్ తరగతులు) ఇకపై 20 వారాలపాటు ఉంటుంది. ఇందులో కమ్యూనిటీ భాగస్వామ్యం, జ్ఞానం, సమాచారం, కరి క్యులమ్‌కు ప్రాధాన్యం ఉంటుంది. ఇవన్నీ కలిపి ఒక పేపరుగా ప్రవేశ పెడతారు.

     

    ఉపాధ్యాయ విద్యార్థులు ఏం నేర్చుకోవాలి?   పిల్లలకు వారేం చెప్పాలి? బోధన పద్ధతులు, అనుసరించాల్సిన నిబంధనలు, ప్రజలతో మ మేకం ఎలా కావాలన్న అంశాలకు ప్రాధాన్యం ఉంటుంది. దీనికి 250 మార్కులు ఉంటాయి.

     

    కంప్యూటర్ ఎడ్యుకేషన్, ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్‌పై ప్రత్యేక ప్రశ్నాపత్రాలు ఉంటాయి. ఏడాది కోర్సులో ఉన్న 6 పేపర్ల స్థానంలో రెండేళ్ల కోర్సులో 12 పేపర్ల విధానం అమల్లోకి తెస్తున్నందునా, ఇలాంటి వివిధ అంశాలకు సంబంధించిన అంశాలపై సిలబస్‌ను సిద్ధం చేశారు.

     

    ఆప్షనల్ కోర్సులుగా వొకేషనల్ ఎడ్యుకేషన్, వర్క్ ఎడ్యుకేషన్, హెల్త్, ఫిజికల్ ఎడ్యుకేషన్, గెడైన్స్ అండ్ కౌన్సెలింగ్ ఉంటాయి. వృత్తి సం బంధ సామర్థ్యాల పెంపునకు (ఎన్‌హాన్సింగ్ ప్రొఫెషనల్ కెపాసిటీస్) ప్రాధాన్యం ఇస్తారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top