తెలుగు బోధన పద్ధతులు
1. ‘అలవోకగా ఉత్పన్నమయ్యే కంఠధ్వనుల సాధనాలతో కేవలం మానవ సంబంధమై, సహజేతర పద్ధతిద్వారా మానవోద్రేకాలు, ఆలోచనలు, వాంఛలు తెలిపేదే భాష’ అన్నవారు?
1) సఫేర్ 2) రాస్
3) మాక్స్‌ముల్లర్ 4) బి.ఎన్.ఝా
2. భాషా ప్రయోజనాలను అల్ప ప్రయోజనం, అధిక ప్రయోజనం అని చెప్పినవారు?
1) రిచర్‌డ అండ్ ఓగ్డెన్ 2) హెన్రీ వెండ్
3) రాస్ 4) మాక్స్ ముల్లర్
3. భాషా ప్రయోజనాలను సాంకేతిక ప్రయో జనం, ఉద్దీపన ప్రయోజనం అని పేర్కొన్న వారు?
1) రిచర్‌డ అండ్ ఓగ్డెన్ 2) హెన్రీ వెండ్
3) రాస్ 4) బి.ఎన్.ఝా
4. పరభాష ద్వారా బోధన అంటే సోపానాలు లేని సౌధం అన్నవారు?
1) రవీంద్రనాథ్ టాగూర్ 2) గాంధీ
3) కాళోజీ 4) సినారె
5. త్రిభాషా సూత్రం వల్ల సంస్కృత భాషకు స్థానం లేకుండా పోయిందని అన్నవారు?
1) టాగూర్ 2) కె.ఎం. మున్షీ
3) రాస్ 4) వావిలాల గోపాలకృష్ణయ్య
6. ఇతర దేశాల్లోని బాలబాలికలు అభ్య సించినట్లు మన పిల్లలు కూడా నాలుగైదు భాషలు నేర్చుకోవాలని ఆశించినవారు?
1) గాంధీ 2) టాగూర్
3) అంబేద్కర్ 4) నెహ్రూ
7. ప్రపంచాన్ని దర్శించాలంటే ఆంగ్లభాషా గవాక్షం నుంచి చూడాలని అన్నవారు?
1) నెహ్రూ 2) గాంధీ
3) సినారె 4) దాశరథి
8. ‘ త్రి భాషాసూత్రం సంస్కృత భాషావ్యాప్తికి గొడ్డలిపెట్టు వంటిది’ అన్నవారు?
1) కె.ఎం.మున్షీ 2) నెహ్రూ 3) టాగూర్
4) వావిలాల గోపాలకృష్ణయ్య
9. ‘కాలమును బట్టి దేశమునుగాంచి ప్రభు త్వమునెంచి దేశభాషా లలితాంగి మారుట ’ అన్నవారు?
1) నన్నయ 2) పాల్కురికి సోమన
3) తిరుపతి వెంకటకవులు 4) జాషువా
10. మాతృభాష తల్లిపాలు- పరభాష పోతపాలు. తల్లిపాలు తాగి పెరిగిన వాడికి, దాదిపాలు తాగి, పోతపాలలో పెరిగిన వాడికి ఎంత తేడా ఉంటుందో మాతృ భాషలో విషయం నేర్చుకున్నవాడికి, పరభాషలో నేర్చుకున్నవాడికి అంతే తేడా ఉంటుంది ఇది ఎవరి అభిప్రాయం?
1) కొమర్రాజు వెంకట లక్ష్మణరావు
2) సినారె 3) జాషువా 4) కాళోజీ
11. మనసును ఒకదానివైపు ఆకర్షింపచేసేదే అభిరుచి అన్నవారు?
1) మాక్స్‌ముల్లర్ 2) బి.ఎన్.ఝా
3) రాస్ 4) ముర్రే
12. అవధానం కలిగించడానికి మనకు నిరం తరం తోడ్పడే మానసిక ప్రక్రియే అభిరుచి అన్నవారు?
1) బి.ఎన్.ఝా 2) రాస్
3) రాబర్‌ట బ్రూక్ 4) ముర్రే
13. ఒక వస్తువు గురించి లేదా ప్రదేశం గురించి లేదా వ్యక్తి గురించి ఏర్పడే ప్రత్యేక భావమే
1) అభిరుచి 2) వైఖరి
3) అవధానం 4) విశ్లేషణ
14. క, ఖ, గ, ఘ, ఙ ?
1) కంఠ్యాలు 2) తాలవ్యాలు
3) మూర్థన్యాలు 4) దంత్యాలు
15. చ, ఛ, జ, ఝ, ఞ ?
1) కంఠ్యాలు 2) తాలవ్యాలు
3) మూర్థన్యాలు 4) దంత్యాలు
16. ట, ఠ, డ, ఢ, ణ ?
1) కంఠ్యాలు 2) తాలవ్యాలు
3) మూర్థన్యాలు 4) దంత్యాలు
17. త, థ, ద, ధ, న ?
1) దంత్యాలు 2) మూర్థన్యాలు
3) తాలవ్యాలు 4) కంఠ్యాలు
18. ప, ఫ, బ, భ, మ ?
1) కంఠ్యాలు 2) తాలవ్యాలు
3) దంత్యాలు 4) ఓష్ఠ్యాలు
19. ఊది పలికేవి?
1) పరుషాలు 2) సరళాలు
3) దంత్యాలు 4) తాలవ్యాలు
20. తేల్చి పలికేవి?
1) పరుషాలు 2) సరళాలు
3) దంత్యాలు 4) తాలవ్యాలు
21. శ, ష, స, హ ?
1) ఊష్మాలు 2) స్థిరాలు
3) అంతస్థాలు 4) తాలవ్యాలు
22. య, ర, ల, ళ లను ఏమంటారు?
1) అంతస్థాలు 2) స్థిరాలు
3) సరళాలు 4) పరుషాలు
23. విద్యార్థుల ఉచ్చారణ, శాబ్దిక దోషాలను సవరించడానికి వీలు కలిగే పఠనం?
1) మౌన 2) ప్రకాశ
3) క్షుణ్న 4) విస్తార
24. క్షుణ్న, విస్తార పఠనాలకు చిత్తాన్ని ఆయత్తపర్చే పఠనం?
1) మౌన 2) క్షుణ్న
3) విస్తార 4) ప్రకాశ
25. 'Some books are to be tasted, others to be swallowed and some few to be chewed and digested' అన్నవారు?
1) రాస్ 2) బేకన్
3) బి.ఎన్.ఝా 4) రాబర్‌ట బ్రూక్
26. వర్ణక్రమదోషాల సవరణకు ఉపకరించే లేఖనం?
1) దృష్ట 2) కాపీ 3) ఉక్త 4) 2, 3
27. భాషానైపుణ్య చతుష్కంలో చివరిది, కష్టతరమైంది?
1) శ్రవణం 2) భాషణం
3) పఠనం 4) లేఖనం
28. 'Bad Spelling is the result of bad hearing'అన్నవారు?
1) రైబర్‌న 2) రాబర్‌ట బ్రూక్
3) ముర్రే 4) బేకన్
29. విద్యార్థి సర్వతోముఖాభివృద్ధికి తోడ్పడేది?
1) పాఠ్యప్రణాళిక 2) విద్యా ప్రణాళిక
3) పాఠశాల 4) వాచకం
30. currereఏ భాషా పదం?
1) లాటిన్ 2) గ్రీకు
3) ఫ్రెంచి 4) ఇంగ్లిష్
31. విద్యాసంస్థ లోపల, బయట జరిగే కార్యకలాపాల సమూహమే?
1) పాఠ్యప్రణాళిక 2) విద్యాప్రణాళిక
3) ప్రణాళిక 4) కరికులం
32. వ్యవస్థీకరించిన జ్ఞానభాగమే?
1) విద్యాప్రణాళిక 2) పాఠ్యప్రణాళిక
3) విద్యా వ్యవస్థ 4) జ్ఞాన విభాగం
33. ‘అంశం, బోధనా పద్ధతులు, ఉద్దేశాలు ఈ మూడు రంగాలతో కూడినదై పరస్పర ప్రభావం ఉన్నది విద్యా ప్రణాళికగా చెప్పొచ్చు’ అన్నవారు?
1) పౌల్ హార్‌ట్స 2) మెకాలె
3) బ్రూక్ 4) ఫిలిప్స్ టేలర్
34. విద్యార్థి సాధించాల్సిన విద్యాలక్ష్యాలు నెరవేరడానికి పాఠశాల నిర్వహించే కార్య కలాపాల సమూహమే విద్యాప్రణాళిక అని అభిప్రాయపడినవారు?
1) పౌల్ హార్‌ట్స 2) ఫిలిప్స్ టేలర్
3) రాస్ 4) రాబర్‌టబ్రూక్
35. "The words in their best order is poetry"అన్నవారు?
1) ఎస్.టి.కాలరిడ్‌జ 2) షెల్లీ
3) వర్‌డ్సవర్‌త 4) కీట్స్
36. కనీస అభ్యసన స్థాయిలను ప్రవేశపెట్టిన సంవత్సరం?
1) 1990 2) 1991 3) 1989 4) 1988
37. మానవుడి శారీరక, మానసిక, ఆధ్యాత్మిక శక్తి యుక్తులు, సామర్థ్యాలు గుర్తించి సమగ్రంగా బహిర్గత మొనరించే సాధనమే విద్య అని చెప్పినవారు?
1) నెహ్రూ 2) బ్రూక్
3) టాగూర్ 4) గాంధీ
38. ఉపాధ్యాయుడు తన వృత్తిని సక్రమంగా నిర్వహించుకోవడానికి ఉపయోగపడేది?
1) పాఠ్యపథకం 2) సమగ్ర పథకం
3) ప్రణాళిక 4) ఉద్దేశాలు
39. శిక్షణ సమయంలో శిక్షణార్థులు బోధనను సక్రమంగా నిర్వహించుకోవడానికి ఉప యుక్తమయ్యేది?
1) పాఠ్యపథకం 2) సమగ్ర పథకం
3) వార్షిక ప్రణాళిక 4) ఏదీకాదు
40. యూనిట్‌ను బోధించడానికి రూపొందిం చిన ప్రణాళికే?
1) యూనిట్ ప్లాన్ 2) సమగ్ర ప్రణాళిక
3) 1, 2 4) పాఠ్యపథకం
41. నాటకంలో నాంది ప్రస్తావన వంటిది?
1) పూర్వజ్ఞాన పరిశీలన
2) ఉన్ముఖీకరణం 3) ప్రదర్శనం
4) మూల్యాంకనం
42. నాటకంలో ప్రదర్శనం వంటిది బోధనాసోపానాల్లో?
1) ప్రదర్శనం 2) చర్చ
3) ప్రవేశం 4) మూల్యాంకనం
43. ప్రదర్శనంలో అతిముఖ్యమైన ఉపసోపానం
1) కవి పరిచయం 2) చర్చ
3) స్థూలార్థ సంగ్రహణం
4) మూల్యాంకనం
44. తెలుగు భాషలో వాచక శబ్దం మొదట దేనికి వాడారు?
1) కృష్ణవాచకం 2) రామవాచకం
3) రాయవాచకం 4) బాలవాచకం
45. ఉపాధ్యాయులకు బోధనలో మార్గ దర్శకత్వం వహించేది?
1) అధ్యాపక దర్శిని 2) వాచకం
3) ఉపవాచకం 4) కృషిపుస్తకం
46. భాషకు ప్రాణం వంటివి?
1) సామెతలు 2) పొడుపు కథలు
3) జాతీయాలు, నుడికారాలు
4) ఏవీకావు
47. పాఠ్యపుస్తకం పరిమాణం?
1) 1/2 డమ్మిసైజు 2) 1/4 డమ్మిసైజు
3) 1/10 డమ్మిసైజు 4) 1/8 డమ్మిసైజు
48. బాషాలక్ష్యాలు నెరవేరడానికి ప్రధాన సాధనం?
1) ఉపవాచకం 2) కృషిపుస్తకం
3) వాచకం 4) 1,2
49. భాషలో అధికారం, స్వామికత్వం లభించడానికి తోడ్పడేవి?
1) వాచకాలు 2) ఉపవాచకాలు
3) కృషిపుస్తకం 4) 2, 3
50. కుటుంబంలో, ప్రయాణంలో, స్నేహితు లతో ఉన్నపుడు చేయాల్సిన పఠనం?
1) క్షుణ్న 2) విస్తార
3) మౌన 4) ప్రకాశ
51. నయన విస్తృతిని కలిగి ఉండే పఠనం?
1) విస్తార 2) మౌన
3) క్షుణ్న 4) ప్రకాశ
52. పాఠ్యపుస్తకం మారినప్పుడల్లా అధ్యాపక దర్శిని?
1) మారదు 2) అలాగే ఉంటుంది
3) మారుతూ ఉంటుంది 4) చెప్పలేం
53. ఉపాధ్యాయుల కర్తవ్య నిర్వహణకు తోడ్పడే ఉత్తమ సాధనం?
1) అధ్యాపక దర్శిని 2) వాచకం
3) ఉపవాచకం 4) కృషిపుస్తకం
54. ప్రాచ్య లాక్షణికులకు ఆద్యుడు?
1) దండి 2) భరతుడు
3) రాజశేఖరుడు 4) వామనుడు
55. ‘లోకోత్తర వర్ణనా నిపుణుడైన కవికర్మ కావ్యం’ అన్నవారు?
1) ముమ్మటుడు 2) దండి
3) భరతుడు 4) వామనుడు
56. సహితాలైన శబ్దార్థాలు కావ్యాలు అన్నది?
1) భామహుడు 2) వామనుడు
3) దండి 4) భరతుడు
57. ‘ఇష్టార్థవ్యవచ్ఛిన్నమైన పద సమూహమే కావ్యం’ అన్నవారు?
1) భామహుడు 2) దండి
3) వామనుడు 4) రాజశేఖరుడు
58. లోచన కర్త?
1) ఆనందవర్థనుడు 2) అభినవగుప్తుడు
3) భరతుడు 4) రాజశేఖరుడు
59. ‘రసగంగాధరం’ రాసినవారు?
1) జగన్నాధ పండితరాయలు
2) భరతుడు 3) వామనుడు
4) భామహుడు
60. ‘గుణాలంకార యుక్తాలైన శబ్దార్థాలు కావ్యం’ అన్నవారు?
1) భామహుడు 2) వామనుడు
3) భరతుడు 4) దండి
61. ‘అదోషాలు, సుగుణాలు, సాలంకారాలైన శబ్దార్థాలు కావ్యం’ అన్నవారు?
1) ముమ్మటుడు 2) దండి
3) రాజశేఖరుడు 4) భరతుడు
62. ‘రసాత్మకమైన వాక్యం కావ్యం’ అన్నది?
1) విశ్వనాథుడు 2) దండి
3) భరతుడు 4) వామనుడు
63. ‘నిర్దోషం, గుణాలంకార రసవంతమునగు వాక్యం కావ్యం’ అన్నవారు?
1) దండి 2) భోజరాజు
3) కేశవమిశ్రుడు 4) భామహుడు
64. ‘గుణాలంకార రీతి, రసోపేతమైన సాధు శబ్దార్థ సందర్భం కావ్యం’ అని నిర్వచించినవారు?
1) పీయూషవర్షుడు 2) దండి
3) వామనుడు 4) భరతుడు
65. ‘రసాలంకార యుక్తం సుఖ విశేష సాధనమైంది కావ్యం’ ఎవరి మాట?
1) దండి 2) కేశవ మిశ్రుడు
3) భరతుడు 4) వామనుడు
66. "Poetry in a general sense may be defined as the expression of imagination" అన్నవారు?
1) పి.బి.షెల్లీ 2) వర్‌డ్సవర్‌త
3) కీట్స్ 4) కార్లైల్
67. "Poetry is the spontaneous overflow of powerful feelings' అన్నవారు?
1) వర్‌డ్సవర్‌త 2) షెల్లీ
3) కీట్స్ 4) కార్లైల్
68. "There are only three things in the world one is to read poetry. another is to write poetry and the best of all is to love poetry" అన్నవారు?
1) కార్లైల్ 2) రాబర్‌ట బ్రూక్
3) షెల్లీ 4) కీట్స్
69. "Poetry we will call musical thought" అన్నవారు?
1) వర్‌డ్స వర్‌త 2) కార్లైల్
3) షెల్లీ 4) కీట్స్
